భారత్ లో కరోనా దెబ్బకు రోజుకో రాష్ట్రం చొప్పున సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో స్కూల్స్ మార్చి 31వరకు మూసేసారు. ఇప్పుడు తాజాగా కేరళ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుంది 7వ తరగతి వరకు మార్చి 31వరకు స్కూల్స్ మూసివేయగా 7,8,9 తరగతుల విద్యార్ధులకు ఎదావిదిగా క్లాస్ లు జరగనున్నాయని, కాని ప్రైవేటు క్లాసులు, అంగనవాడీలకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు కేరళ సీఎం పినరాయి విజయన్ తెలిపారు. ఇండియాలో మొదటి కేసు కేరళలోనే నమోదయిన విషయం అందరికి తెలిసిందే. ఇది ఇక్కడితో ఆగుతుందా లేక ముందుకు సాగుతుందా అనేది వేచి చూడాల్సిందే.
