ఏపీ తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు శనివారం హైదరాబాద్ లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే.
అయితే తండ్రి మారుతీరావు ఆస్తి కోసమే అమృత డ్రామాలాడుతుందని ఆమె బాబాయి శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. మారుతీరావు నిన్నటి వరకు ఉరితీయాలని డిమాండ్ చేసిన అమృత ఇప్పుడేమో తమపై ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.
ఇన్ని రోజులు తండ్రి మీద లేని ప్రేమ ఆయన చనిపోగానే ఎలా వచ్చిందని శ్రవణ్ ప్రశ్నించారు. అమృత చేసిన పనుల వలనే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన అన్నారు. తన అన్న మృతిపై దర్యాప్తు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశాడు.