ప్రపంచ వ్యాప్తంగా జనాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ముఖ్యంగా చైనా, ఇరాన్, ఇటలీ వంటీ దేశాలలో ఎక్కువగా ప్రభావితమై ఉంది. ఈ నేపధ్యంలో ఇరాన్ లో ఈ వైరస్ ఎక్కువగా ఉండడంతో ఆ దేశంలో చిక్కుకుపోయిన 58మంది భారతీయులను భారతవాయుసేన మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. ఇరాన్ రాజధాని ఐన టెహరాన్ ఎయిర్ పోర్ట్ నుండి వారిని తీసుకొచ్చినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తెలిపారు. ఈ విమానంతో పాటు నలుగులు వైద్యులను కూడా పంపినట్టు తెలుస్తుంది. అక్కడ మనవారికి వారు కూడా మంచిగా సహకారం అందించడంతో ఈ 58 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇరాన్ లో 7161 మందికి కరోనా వైరస్ సోకగా వారిలో 237మంది చనిపోయారు.
