తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ ఆర్థిక సంవత్సరానికి చెందిన రూ.1,82,914.42కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఈ సందర్భంగా రైతు రుణాల మాఫీకి సంబంధించి ఆరు వేల కోట్లకుపైగా కేటాయించింది.
ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ రూ ఇరవై ఐదు వేలలోపు ఉన్న రుణాలను ఈ నెల మార్చిలో మాఫీ చేస్తామని ప్రకటించారు. దీని వలన ఐదున్నర లక్షల మందికి లబ్ధి జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
అయితే మొత్తం 40.66లక్షల మందికి రుణాలు మాఫీ అవుతాయని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేస్తుంది. అయితే నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమచేయకుండా స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా రైతులకు చెక్కులను పంపిణీ జరుగుతుందని ఆర్థిక మంత్రి హారీష్ రావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.మరో వైపు ఇరవై ఐదు వేల నుండి లక్ష వరకు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని కూడా మంత్రి హారీష్ తెలిపారు.