కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ కేంద్ర మంత్రి.. మాజీ గవర్నర్ అయిన నేత హన్స్ రాజ్ భరద్వాజ్ కన్నుమూశారు. గత బుధవారం గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు సాకేత్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
కిడ్నీకి సంబంధించిన పలు సమస్యలు తలెత్తాయి. అయితే భరద్వాజ్ ను కాపాడేందుకు చేసిన పలు ప్రయత్నాలు ఫలించలేదు.
ఎనబై మూడు ఏళ్ళ భరద్వాజ్ నిన్న ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య,కుమారుడు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతంలో ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా.. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ గా పని చేశారు.