ఏపీ తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు శనివారం హైదరాబాద్ లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే మారుతీరావు అత్మహత్య కేసులో పలు కొత్త అనుమాలు వ్యక్తమవుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మారుతీరావు పోస్ట్ మార్టం కు చెందిన పలు విషయలు వ్యక్తమవుతున్నాయి. మారుతీరావు శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఆయన శరీరం రంగు మారడానికి పాయిజన్ కారణమని ఆ నివేదికలో ఉంది.
విషం తీసుకోవడం వలన మారుతీరావు మృతి చెందారని అందులో పోస్ట్ మార్టం చేసిన వైద్యులు చెబుతున్నారు. మారుతీరావు శరీరంలో రక్త సరఫరా ఆగిపోయి బ్రెయిన్ డెడ్ ,కార్డియాక్ అరెస్ట్ జరిగినట్లు వైద్యులు ఆ నివేదికలో పొందుపర్చారు.