టీమిండియా మాజీ సీనియర్ క్రికెటర్ హర్బజన్‌సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రయాణించే విమానంలోనే తన క్రికెట్ బ్యాట్ చోరీకి గురైంది.
భారత క్రికెటర్ మాజీ స్పిన్నర్ అయిన హర్బజన్ సింగ్ ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నారు. హర్బజన్ తమిళ చిత్రాలలోను నటిస్తున్నారు.
శనివారం అతను ముంబై నుంచి కోవైకు విమానంలో క్రికెట్ కిట్‌తో బయలుదేరారు. విమానం కోవై చేరుకోగానే కిట్ బ్యాగ్‌ను పరిశీలించగా అందులోని క్రికెట్ బ్యాట్ మాయమైంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన అతను వెంటనే తన ట్విట్టర్ ద్వారా విమాన సంస్థకు ఫిర్యాదు చేశారు.