టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కెరీర్ పై ఆయనకంటే అభిమానులకే టెన్షన్ ఎక్కువగా ఉంది. ఎప్పుడెప్పుడు జట్టులోకి అడుగుపెడతాడు అని అందరు ఎదురుచూస్తున్నారు. జూలైలో ప్రపంచకప్ లో భాగంగా సెమీస్ లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయిన తరువాత నుండి ధోని జట్టుకి దూరం అయ్యాడు. అప్పట్లో ధోని కెరీర్ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ రావిశాస్త్రి ఐపీఎల్ లో తన ఆట బట్టి జట్టులోకి రావాలో లేదో తెలుస్తుందని అన్నాడు. అయితే అప్పుడు ఆయన మాటలు ఎవరూ పట్టించుకోలేదు. కాని ఇప్పుడు అదే నిజం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 29న ఐపీఎల్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ చెన్నై, ముంబై మధ్య జరగనుంది. ఇక ఈ ఐపీఎల్ లో ధోని ఫామ్ బయటపడితేనే భారత జట్టులో స్థానం దక్కనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి.
