కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి, బెంగళూరులోని కిండర్ గార్టెన్ తరగతులకు బెంగళూరు ఆరోగ్య కమిషనర్ సెలవు ప్రకటించారు. మార్చి 31 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. అంతకుముందు, ఢిల్లీలో ని ప్రాథమిక పాఠశాలలు కరోనా వైరస్ వల్ల విద్యార్థులను సురక్షితంగా ఉంచడానికి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో స్కూల్ కి వెళ్ళే పిల్లలకు జలుబు, రొంప వంటివి వస్తే బడికి పంపవొద్దని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతీ స్కూల్ లో రోజుకు మూడుసార్లు సబ్బుతో చేతులు కడుక్కోవాలని ఈమేరకు అదనపు నీరు కూడా పెట్టాలని ఆదేశించారు.