ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు అంత్యక్రియలకు కూతురైన అమృత హాజరైంది..భారీ పోలీసుల భద్రత నడుమ మధ్య తన తండ్రి మారుతీరావు మృతదేహాన్ని చూడటానికి వచ్చిన అమృతకు చేదు అనుభవం ఎదురైంది.
పోలీసు వాహానంలో మిర్యాలగూడలోని హిందూ స్మశాన వాటికకు ఆమె వచ్చింది. అయితే తన తండ్రి మారుతీరావు చావుకు కారణమైన అమృతకు కడసారి తండ్రిని చూసే అర్హత లేదని అమృత గో బ్యాక్ అంటూ మారుతీరావు బంధువులు,సన్నిహితులు నినాదాలు చేశారు..
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తండ్రి మారుతీరావు భౌతికాయాన్ని చూసి అమృత వెంటనే వెనుదిరిగిపోయింది..