చాలా గ్యాప్ తరువాత జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది పింక్ సినిమా రీమెక్..కాగా దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ సినిమా మొత్తం మహిళలకు సపోర్ట్ గానే ఉంటుంది. అయితే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి ఒక సాంగ్ రిలీజ్ చేసారు. ఇది కేలవం మహిళలకు సంబంధించిందే. సాంగ్ విడుదలైన కొద్ది క్షణాలకే ఫుల్ వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. దానికితోడు ఈ పాట సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడాడు.
