Home / ANDHRAPRADESH / టీడీపీ డబుల్‌గేమ్‌పై మండిపడిన వైవి సుబ్బారెడ్డి..!

టీడీపీ డబుల్‌గేమ్‌పై మండిపడిన వైవి సుబ్బారెడ్డి..!

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై టీడీపీ  చేస్తున్న కుటిల రాజకీయంపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాజాగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైవి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులు విజయఢంకా మోగించడం తధ్యమని   ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 9 నెలల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలే అభ్యర్ధుల విజయానికి బాటలు వేస్తాయన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కాకినాడ పార్లమెంటరీ నేతలు, కార్యకర్తలతో వైవి సుబ్పారెడ్డి గారు చర్చించారు.

 

ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు ఆడుతున్న డబుల్‌గేమ్‌పై  తీవ్రంగా స్పందించారు. బీసీల రిజర్వేషన్‌పై చిత్తశుద్ధితో 59.83 శాతం అమలు చేయాలని చూశామని, కానీ ప్రతిపక్ష పార్టీల నేతలు బీసీ ద్రోహులుగా కోర్టు ద్వారా ఆ ప్రక్రియను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి సుమారు రూ. 5 వేల కోట్ల సాయం నిలిచిపోయే పరిస్థితి ఉందన్నారు. అందుకే సీఎం జగన్ గారు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతాప్ రెడ్డి టీడీపీ నాయకుడని, సామాజికవర్గాన్ని బట్టి అతను వైఎస్సార్‌ సీపీకి చెందిన వాడని ప్రచారం చేస్తున్నారని వైవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కాగా స్థానిక సంస్థల ఎన్నికలలో హైకోర్ట్ తీర్పు నేపథ్యంలో బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కుతున్నాయి. దీంతో చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే సీఎం జగన్ తాజాగా జనరల్ కేటగిరిలో కూడా 10 శాతం బీసీలకు కేటాయించమని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఎం జగన్ గతంలో ప్రకటించిన విధంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. సీఎం జగన్ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తుండగా…చంద్రబాబు, టీడీపీ నేతలు కంగుతిన్నారు. కాగా జనరల్ కేటగిరిలో 10 శాతం బీసీలకు కేటాయించే ధైర్యం చంద్రబాబు చేయలేడు.ఒక వేళ రాజకీయంగా చేయాలని ప్రయత్నించినా..పార్టీ శ్రేణులు ఒప్పుకోవు..అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. మొత్తంగా సీఎం జగన్ ఎత్తుగడతో చంద్రబాబు చిత్తయిపోయాడనే చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat