ఈ ఫొటోలో నాట్యం చేస్తున్న కళాకారిణిని గుర్తుపట్టారా.? చక్కని అభియనం.. అద్భుతమైన ముఖ వర్చస్సుతో నాట్యం చేస్తున్న ఆమె ఎవరో కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా.. స్వతహాగా నటి కావడంతో శనివారం రవీంద్రభారతిలో లైఫ్ ఎన్ లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నవజనార్దన పారిజాతం శీర్షికన ఆమె ఆంధ్రనాట్య ప్రదర్శన నిర్వహించారు. ఇందులో ‘పుష్పాంజలి’ అనే అంశంపై రోజా చేసిన నాట్యం తన నృత్య పటిమను చాటుకున్నారు. ఈసందర్భంగా గవర్నర్ తమిళిసై రోజాను సత్కరించారు. రోజా నవంబర్ 17న 1972లో తిరుపతిలో జన్మించారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయవిజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ఆమె తండ్రి కుమారస్వామి రెడ్డి.. స్వతహాగా చిత్తూరుజిల్లానే అయినా చిన్నతనంలోనే హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అప్పుడే రోజా కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. అనంతరం తమిళ చిత్ర దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకున్నారు. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అనంతరం సినీరంగంలో ప్రవేశించి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. పదుల సంఖ్యలో అందరు సూపర్ స్టార్లతో కలిసి నటించిన రోజా కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.
ఇటీవల తిరిగి మొగుడు, గోలీమార్, శంభో శివ శంభో వంటి సినిమాల్లో నటిస్తూ మళ్లీ తన వెండితెర ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నరు. బుల్లితెరపై జబర్దస్త్ వంటి కర్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోనిరవీంద్రబారతిలో లైఫ్ “ఎన్” లా ఫౌండేషన్ నవజనార్ధన పారిజాతం ఆంధ్రనాట్య ప్రదర్శనలో రోజా నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ ‘సినిమాలంటే తనకు పెద్దగా ఆసక్తిలేదని కానీ రోజా భర్త సెల్వమని గొప్ప డైరెక్టర్ అన్న సంగతి తెలుసన్నారు. మువ్వ నాట్య ప్రదర్శన చాలా గొప్పది. ఫౌండేషన్ నిర్వహిస్తున్న రోజా సెల్వమణికి అభినందనలు. 1000 సంవత్సరాలుగా వస్తున్న గొప్ప సంస్కృతి. ఆంధ్రనాట్య ప్రదర్శనను 11వ శతాబ్దంలో నటరాజ రామకృష్ణన్ కనుగొన్నారు. దీన్ీి దేవాలయాలలో ప్రదర్శిస్తారు. నాట్య సంస్కృతిని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. ఫౌండేషన్ చైర్మన్ రోజా డ్యాన్స్ ప్రదర్శన అద్భుతమన్నారు. రాజకీయాల్లో అగ్ర నాయకురాలిగా ఉన్నా తాను ఎదిగిన, తనకు జీవితాన్నిచ్చిన రంగాన్ని, చిన్నతనంలో నేర్చుకున్న నృత్యాన్ని రోజా మర్చిపోలేదు. మహిళా దినోత్సవం రోజున ఆమె చేసిన ప్రదర్శన అందరినీ కట్టి పడేసింది. ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తూ, స్వచ్ఛంధ సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ, నటిగా తాను ఎదిగిన ఫీల్డ్ ను మర్చిపోకుండా, మరోవైపు మంచి భార్యగ, తల్లిగా రోజా పోషిస్తున్న పాత్ర అద్వితీయమనే చెప్పాలి.