చరణ్ RRR సినిమా తర్వాత మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. `మళ్లీ రావా`- `జెర్సీ` చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఓ ప్యూర్ లవ్ స్టోరీని వినిపించారట.. ఇది నార్త్ – సౌత్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. పంజాబీ అమ్మాయి, దక్షిణాది అబ్బాయిల మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గౌతమ్ వినిపించాడట. ఈ పాయింట్ పాన్ ఇండియా అప్పీల్ తో చరణ్ కి సరిగ్గా సరిపోతుందట. ఇక గౌతమ్ మేకింగ్ స్టైల్ గురించి చెప్పాల్సినవసరం లేదు. గౌతమ్ తనదైన శైలిలో ఎమోషన్ ని పీక్స్ లో చూపించగలడని ఇప్పటికే అర్ధమైంది. మళ్లీరావా, జెర్సీ సినిమాలకు గౌతమ్ సెన్సిబిలిటీస్ ప్రధాన కారణం. తాజాగా చరణ్ కు వినిపించిన కథలోనూ ఓ ఎమోషన్ కామన్ గా ఉందట. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారన్నది తెలియాల్సిఉంది.
