యావత్ భారతదేశం నేటికోసమే ఎదురుచూస్తుంది. ఎందుకంటే మొదటిసారి భారత్ మహిళల క్రికెట్ జట్టు టీ20 ఫైనల్ కు చేరుకుంది. మెల్బోర్న్ వేదికగా ఈరోజు ఆస్ట్రేలియా, ఇండియా మధ్య ఫైనల్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా భరిలోకి వచ్చిన ఆసీస్ మొదటి మ్యాచ్ ఇండియా పై ఓడిపోయింది. ఇండియా మాత్రం లీగ్ దశలో అన్ని మ్యాచ్ లు గెలిచి సెమీస్ లో ఇంగ్లాండ్ తో జరగాల్సిన మ్యాచ్ లో వర్షం రావడంతో నేరుగా ఫైనల్ కు చేరుకుంది. ఇక ఆస్ట్రేలియా సెమీస్ లో సౌతాఫ్రికా పై గెలిచింది. ఇది ఇండియాకు గట్టి పోటీ అనే చెప్పాలి ఎందుకంటే ఆస్ట్రేలియా మొత్తం మొత్తం 7 టీ20 ప్రపంచ కప్ లు జరగగా దీంతో కలిపి 6సార్లు ఫైనల్ కు వచ్చింది. మరి ఈ మ్యాచ్ లో ఇండియా ఆసీస్ పై గెలిచి విజేతగా నిలుస్తుందో లేదో చూడాలి. ఇక టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాట్టింగ్ తీసుకుంది.
