దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఖైరతాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకోవడంతో తన పరువు పోయిందనే కోపంతో అల్లుడు ప్రణయ్‌ను కిరాయి హంతక ముఠాలతో మారుతీరావు చంపించాడు. ఈ హత్య కేసులో జైలుకు వెళ్లిన మారుతీరావు ఇటీవల బెయిల్‌పై విడుదల అయ్యారు. జైలు నుంచి వచ్చాక ఇంటికి రమ్మని కూతురు అమృతపై మధ్యవర్తులతో ఒత్తిడి చేయించాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో మారుతీరావు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నిన్న రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన మారుతీరావు ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యభవన్‌లో రెండు రోజులకని రూమ్ తీసుకున్నాడు. గదిలో పాయిజన్ తీసుకుని మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్యవైశ్య భవన్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మారుతీరావు డెడ్‌బాడీని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత స్పందించారు. మారుతీరావు మరణవార్త అఫిషియల్‌గా తమకు సమాచారం లేదని తెలిపారు. నాన్న ఆత్మహత్య చేసుకున్నాడన్న సంగతి టీవీలో చూసే తెలుసుకున్నామని అమృత తెలిపారు . ప్రణయ్ హత్య జరిగిన తర్వాతినుంచి తండ్రి తనతో టచ్‌లో లేడని పేర్కొన్నారు. ప్రణయ్‌ను చంపిన ప్రశ్చాత్తాపంతోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ పరువు హత్యోదంతంలో మారుతీరావు జీవితం విషాదంతంగా ముగిసింది.
