తెలంగాణలో కొవిడ్-19 వైరస్ నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రశంసించా రు. కొవిడ్-19 నియంత్రణపై అన్ని రాష్ర్టాల మంత్రులు, ఉన్నతాధికారులతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఇందులో మన రాష్ట్రం తరఫున వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ యోగితారాణా పాల్గొన్నా రు. కరోనా పరీక్షలు, ఐసొలేషన్ వార్డులు, ల్యాబ్‌ల ఏర్పాటుపై కేంద్ర మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హర్షవర్ధన్ అభినందించారు.
వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎన్- 95 మాస్కులను రాష్ర్టాలకు పంపిణీచేయాలని, తెలంగాణలో మరో ల్యాబ్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. అనంతరం వైరస్ నియంత్రణపై కేంద్రమంత్రి పలు సూచనలుచేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నదని కితాబిచ్చారు. మిగతా రాష్ర్టాలు కూడా తెలంగాణను అనుసరించాలని సూచించారు.