ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. శుక్రవారం నుంచి మార్చి 13 వరకు నామినేషన్ల దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. 16న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, 18న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధిస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ను జారీ చేశారు. దీంతో రాజ్యసభ సభ్యులుగా ఎవరు ఎన్నికవుతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
