హీరో విజయ్ దేవరకొండ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి అరెస్టయ్యాడు. యూ ట్యూబ్‌లో ఓ చానెల్ ప్రారంభించి, విజయ్ దేవరకొండ గొంతుతో అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రయత్నించేవాడు. అంతకు ముందు హీరో విజయ్ దేవరకొండ ఇచ్చిన ఫిర్యాదుమేరకు సైబర్ క్రైం పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు. అతను సాయి కిరణ్ అలియాస్ డబ్బింగ్ విజయ దేవరకొండగా గుర్తించారు. తనను కలవాలంటే ముందు సాయి కిరణ్‌ను సంప్రదించాలని, నిందితుడు తన ఫోన్ నంబర్‌ను యూట్యూబ్‌లో ఉంచాడు. విజయ్ గొంతుతో మాట్లాడి వీడియోలను పోస్ట్ చేశాడు. వీటిని చూసిన విజయ్ అనుచరుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీనివల్ల హీరో స్టేటస్ దెబ్బతింటుందని ఫిర్యాదు చేసారు. దీంతో నిందితుణ్ని పోలీసులు పట్టుకున్నారు. ఓ అమ్మాయితో మాట్లాడించి వాట్సాప్‌లో ఛాటింగ్ చేయించారు. నిజమేనని నమ్మిన సాయికిరణ్ వాట్సప్ చాటింగ్ కొనసాగిస్తూ సాయికృష్ణ ‘ఈ రాత్రికి డేటింగ్ చేద్దాం. రేపు పెళ్లి చేసుకుందాం’ అంటూ సమాచారమిచ్చి గురువారం రాత్రి సిటీకి చేరుకున్నాడు. ఎల్బీ నగర్ లో వల పన్నిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మీర్జాపూర్‌కు చెందిన వ్యక్తి. నిందితుడు ప్రస్తుతం మీర్జాపూర్‌లో ఇడ్లీ బండి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇతనికి తండ్రి లేడు. తల్లి దివ్యాంగురాలు కావడంతో ఆమెకు ఇతడే ఆధారం. సాయిని నిందితుడి పరిగణిస్తూ సీఆర్పీసీ నోటీసులు జారీచేసిన పోలీసులు ఊరినుంచి వచ్చిన పెద్దలకు అతనిని అప్పగించారు.