కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై ఉగ్రదాడులకు కుట్ర జరుగుతుందా..?. త్వరలోనే ఉగ్రదాడులు జరిగే అవకాశముందా..? అంటే అవుననే అంటుంది ఇంటలిజెన్స్ బ్యూరో..
గుజరాత్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా,సీఎం విజయ్ రూపానీ,డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ సహా పలువురు మంత్రులపై ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది.
అహ్మదాబాద్ ,సూరత్ ,వడోదర,రాజ్ కోట్ నగరాల్లో ఈ దాడులు జరగవచ్చు అని హెచ్చరించింది. గుర్తు తెలియని వ్యక్తుల నుండి మంత్రులకు హెచ్చరిక లేఖలు కూడా వచ్చాయి. పోలీసులు,భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది.