ప్రజా చైతన్యయాత్ర పేరుతో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు సభలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తల్లో మళ్లీ జోష్ నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో జిల్లాలవారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఎక్కడైనా గెలిచే అవకాశం ఉందా అనే పరిస్థితలపై ఆరా తీస్తున్నారు. స్థానిక నేతలతో చర్చించి నియోజకవర్గ ఇంఛార్జ్ లను నియమించే పనిలో పడ్డారు. కానీ చాలాచోట్ల నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలను భుజాన వేసుకునేందుకు ఎవరూ ముదుకు రావట్లేదు. వైసీపీ సర్కార్ చేపట్టిన ప్రజా సంక్షేమ పధకాలు, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పధకాలు గతంలోకంటే ఇప్పుడు అందుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరగడం, తెలుగుదేశం పార్టీపై ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం అనేది చంద్రబాబు, ఆయన పార్టీ శ్రేణులకు అర్ధమయ్యిందట.