జగ్గయ్యపేటకు చెందిన నమస్తే పేపర్ ఎడిటర్ సైదేశ్వరరావు దాదాపేగా నాలుగు సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సివిల్ కోర్టులో పరువునష్టం దావావేసారు. ఈక్రమంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ను అనేకమార్లు న్యాయస్థానానికి హాజరుకావాలని కోరినా ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అరెస్ట్ వారెంట్ సమన్లు జారీచేయడంతో రాధాకృష్ణ శుక్రవారం జగ్గయ్యపేట కోర్టుకు హజరయ్యారు.
