టీటీడీ ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. ఎల్1, ఎల్ 2, ఎల్ 3 విఐపీ బ్రేక్ దర్శనాల రద్దుతో సామాన్య భక్తులను దేవుడికి మరింత దగ్గర చేశారు. అంతే కాదు వృద్ధులకు, బాలింత స్త్రీలకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారు. ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఏడుకొండలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతున్నారు. ఇదివరకు వీఐపీలకు మాత్రమే అందుబాటులో ఉండే కల్యాణోత్సవం లడ్డూలను సామాన్య భక్తులకు అందజేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత..సామాన్య భక్తులకు వెంకన్న దర్శనం త్వరతిగతిన జరుగుతుందని నెట్‌జన్లు ట్విట్టర్‌లో కామెంట్ చేస్తున్నారంటే…వైవి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా వైవి సుబ్బారెడ్డి ముందుచూపుతో వెంకన్న సొమ్ము 1300 కోట్లు సేఫ్ అయ్యాయి. ప్రస్తుతం ఎస్ బ్యాంక్ తీవ్ర సంక్షోభంలో పడింది. RBI ఇప్పటికే యస్ బ్యాంక్‌కు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. డిపాజిట్ దారులు 50వేల రూపాయలకు మించి విత్ డ్రా చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. దివాళా తీసిన ఈ బ్యాంకు త్వరలో మూతపడనుంది. అయితే సంక్షోభంలో పడిన యస్ బ్యాంకు పరిస్థితిపై ప్రమాద ఘంటికలు ముందస్తుగానే గుర్తించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బా రెడ్డి కొన్ని నెలల కిందటే బ్యాంకులో ఉన్న రూ.1300 కోట్ల డిపాజిట్లు ఉపంసహరించారు. అప్పుడు టీటీడీ డిపాజిట్లు వెనక్కి తీసుకోవడంపై ప్రతిపక్ష టీడీపీ తీవ్రవిమర్శలు చేసింది. అయినా వైవి లెక్కచేయలేదు. యస్ బ్యాంకు దివాళా తీస్తుందని భావించిన వైవి వెంటనే వెంకన్న పేరుతో ఉన్న 1300 కోట్ల డిపాజిట్లు వెనక్కి తీసుకున్నారు.
కాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యస్ బ్యాంకుతో సహా నాలుగు ప్రైవేటు బ్యాంకుల్లోకి టీటీడీ డిపాజిట్లు వేశారు. ప్రైవేట్ బ్యాంకుల్లో అయితే తమకు ఇష్టం వచ్చినట్లు టీటీడీ నిధులను కాజేయచ్చు అని టీడీపీ పెద్దలు కుట్ర చేశారు. కానీ 2019లో ప్రభుత్వం మారి, వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టగానే డిపాజిట్ల వ్యవహారంపై దృష్టి పెట్టారు. నాలుగు బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకున్న టీటీడీ ఛైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి గారు.. యస్ బ్యాంకు పరిస్థితులపై ప్రమాదకర ఘంటికలను గుర్తించారు. డిపాజిట్లను వెంటనే రద్దు చేసి నగదు తిరిగి ఇవ్వాల్సిందిగా చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. డిపాజిట్లు ఉపసంహరించుకోవద్దని ఆయనపై ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఖాతరు చేయకుండా రూ.1300 కోట్లు వెనక్కి రప్పించారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకు వచ్చారు. దేవుడి సొమ్ము భద్రంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డికి సూచించారు. చివరకు యస్ బ్యాంకు నుంచి రూ.1300 కోట్లు డిపాజిట్లను టీటీడీ ఉపసంహరించుకుంది. తద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన 1300 కోట్ల డిపాజిట్లు వై వి సుబ్బారెడ్డి ఎస్ బ్యాంక్ బారి నుంచి రక్షించారు. మొత్తంగా టీటీడీ ఛైర్మన్ వైవి ముందుచూపుతో దేవుడి సొమ్ము 1300 కోట్లు సేఫ్ అయ్యాయి. దీంతో భక్తులంతా వైవి సుబ్బారెడ్డి నిర్ణయం భేష్ అంటున్నారు. ఏడు కొండలవాడికి సొమ్ముకు కొండంత కాపలా…టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అని భక్తులు కొనియాడుతున్నారు.