2007 లో సౌతాఫ్రికా వేదికగా మొదటిసారి టీ20 ప్రపంచకప్ ప్రారంభం అయ్యింది. అప్పట్లో ఎటువంటి అంచనాలు లేకుండా భరిలోకి వచ్చిన జట్టు ఇండియా. కొత్త సారధి ధోని కి భాధ్యతలు అప్పగించారు. ఈ మెగా ఈవెంట్ లో ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికా గెలుస్తుందేమో అని భావించారంతా కాని అనూహ్య రీతిలో భారత్ ఘన విజయం సాధించింది. ఆ తరువాత మళ్ళా శ్రీలంక తో ఫైనల్ లో ఓడిపోయింది. ఇక మహిళల విషయానికి వస్తే ఈ జట్టు మొదటిసారి ఫైనల్ కు వచ్చింది. ఇలా ఒక ధోని, హర్మాన్ప్రీత్ కౌర్ మాత్రమే టీ20 ప్రపంచకప్ లో భారత్ ను ఫైనల్ కు చేర్చారు.
