కరోనా వైరస్ కేసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సమీక్ష నిర్వహించింది. అన్ని రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కార్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సమీక్ష జరిపారు. కరోనా పరీక్షలు, ఐసోలేషన్ వార్డులు, ల్యాబ్‌లు, రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై సమీక్షలో చర్చంచారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రి హర్షవర్థన్ అభినందించారు. కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ పకడ్బందీ ప్రణాళికతో ముందుకుసాగుతుందని అన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరించాలని హర్షవర్ధన్ కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి ఈటెల రాజేందర్… ఎన్-95 మాస్క్‌లను రాష్ట్రాలకు పంపిణీ చేయాలని, తెలంగాణలో మరో ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరారు.
Home / TELANGANA / కారోనా వైరస్.. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్..కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్