టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంధువులకు చెందిన ఫాంహౌస్‌ను అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సహా మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు రేవంత్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తాజాగా డ్రోన్ వినియోగం కేసులో ఎంపీ రేవంత్ రెడ్డికి రాజేంద్రనగర్ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో బెయిల్ కోరుతూ రేవంత్ సహా అరెస్టైన మరో ఐదుగురు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. రేవంత్ మినహా మిగతా ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.