ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఆయన అనుకుల మీడియా ఛానళ్లు జర్నలిజం విలువలను తొంగలొ తొక్కేస్తూ… నిస్సిగ్గుగా బరితెగిస్తూ ప్రత్యర్థి పార్టీల నేతలపై ఎలా దుష్ప్రచారం చేస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అమరావతి ఆందోళనల నేపథ్యంలో చంద్రబాబు అనుకుల బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పదే పదే మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఎల్లోమీడియా ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నాడు. అయితే కేంద్రం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం..అందులో కేంద్రం జోక్యం చేసుకోదు..రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని పార్లమెంట్ వేదికగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిరంజన్ రాయ్ తెలిపారు. ఇదే విషయంపై జీవియల్ కూడా పదే పదే మూడు రాజధానుల ఏర్పాటు అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని కుండబద్ధలు కొడుతున్నారు. దీంతో జీవియల్‌పై కత్తి గట్టిన చంద్రజ్యోతి ఆయన వైసీపీకి తొత్తుగా మాట్లాడుతున్నారంటూ అసత్య ప్రచారం చేస్తోంది.
ఇటీవల జీవియల్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సీరియస్ అయినట్లు ఓ కట్టు కథనం అల్లింది. కొద్ది రోజుల క్రితం కొద్ది రోజుల క్రితం రాష్ట్ర బీజేపీ నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జీవీఎల్ ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ని కలిశారంట…దీనిపై దీనిపై కొందరు రాష్ట్ర నేతలు నడ్డా దృష్టికి తీసుకెళ్ళి ఆయనపై ఫిర్యాదు చేశారంటూ చంద్రజ్యోతి స్టోరీ అల్లింది. అంతే కాదు అమరావతి విషయంలో, ఏపీ రాజకీయాల విషయంలో జీవీఎల్ నరసింహారావు చేస్తున్న వ్యాఖ్యలు అధికార వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయంటూ, పార్టీ లైన్ దాటుతూ మీడియా ముందు ఆయనకు నచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారని నడ్డాకి ఫిర్యాదు చేశారని సమాచారం అంటూ చంద్రజ్యోతి చెప్పుకొచ్చింది. ఈ ఇష్యూలో జీవియల్‌కు బీజీపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సీరియస్ క్లాస్ తీసుకున్నారంటూ..సదరు పత్రిక అసత్య కథనం ప్రచురించింది.
అయితే తాజాగా ఈ పచ్చకథనంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ సహ ఇన్‌ఛార్జి సునీల్ దేవ్‌ధర్ మండిపడ్డారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జీవిఎల్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారంటూ పూర్తిగా అవాస్తవ కథనాన్ని ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీనికి ఆ ఛానల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ వైఖరిని మార్చుకోకపోతే ఆ ఛానల్ చర్చలను బహిష్కరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ బీజేపీ ఇన్‌చార్జి సునీల్ దేవధర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో సదరు మీడియా ఛానల్, పత్రిక పేరును ఉద్దేశిస్తూ డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. మా జాతీయ అధికార ప్రతినిధి జీవియల్ నరసింహరావుగారికి వ్యతిరేకంగా కొన్ని వార్తా సంస్థలు చేసిన నకిలీ రిపోర్టింగ్‌ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పుడు వార్తలు ప్రసారం చేసి బీజేపీ నాయకులపైన దుష్ప్రచారం చేసే ఏబీఎన్ లాంటి చానెల్స్ పై చట్టపరమైన చర్యలకు వెనుకాడం అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. గత 9 నెలలుగా వైసీపీ, బీజేపీలపై దుష్ప్రచారం చేస్తున్న ఏబీఎన్‌లాంటి చంద్రబాబు అనుకుల ఛానెల్స్‌ను ఇక ఉపేక్షించేది లేదని బీజేపీ అధిష్టానం హెచ్చరిస్తోంది. మొత్తంగా చంద్రబాబు అనుకుల మీడియా కాషాయదళం కన్నెర్ర చేయడం ఏపీ రాజకీయ, మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది.