ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలవరం సృష్టిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కీలకమైన నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా తమ సంస్థకు చెందిన ఉద్యోగులెవరూ కూడా చైనా ,హాంకాంగ్ ,మకావ్ వంటి ప్రాంతాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా సింగపూర్,దక్షిణ కోరియో ,జపాన్ ,ఇటలీలకు కూడా వెళ్లవద్దని సలహా ఇచ్చింది. ఎవరైన సరే ఉద్యోగులు చైనా వెళ్తే వారు స్వచ్చందంగా పద్నాలుగు రోజుల పాటు ఇంటి దగ్గర నుండే పని చేయాలని .. వైరస్ లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఆఫీసులకు రావాలని ఆదేశాలను జారీ చేసింది.