ప్రముఖ సీనియర్ పాత్రికేయలు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిచెందిన విషయం అందరికి తెలిసిందే. పత్రికా, సామాజికరంగాల్లో ఆయన చేసిన కృషి అందించిన సేవలు మరువలేనివి. ఆయన మృతి పట్ల వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సంతాపం పలికారు. “ప్రముఖ సీనియర్ పాత్రికేయలు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతికి నా ప్రగాఢ సంతాపం. పాత్రికేయుడిగా, పత్రికా సంపాదకుడిగా తెలుగు పత్రికా రంగానికి అయిదు దశాబ్దాలపాటు ఆయన అందించిన సేవలు మరువరానివి. పొత్తూరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియచేస్తున్నా” అని ట్వీట్ చేసారు.
