వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు.’‘నారా వైరస్’ కరోనా కంటే భయంకరమైనది. కరోనాకు ఇంకా చికిత్స కనుగొనాల్సి ఉన్నా రాష్ట్ర ప్రజలు మాత్రం నారా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేశారు. ఆ వ్యాక్సిన్ తోనే పది నెలల క్రితం వైరస్‌ను తరిమికొట్టారు. మళ్లీ వ్యాప్తి చెందేందుకు అబ్బా కొడుకులు, కుల మీడియా కిందా మీదా పడుతోంది” అని అన్నారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలని చూసిన ప్రజలకి అంతా తెలుసు కాబట్టి వారిని మళ్ళీ నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
