తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ,మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టు అయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రేవంత్‌ను నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనుమతి లేకుండా రెండు రోజుల క్రితం మియాఖాన్ గూడ వద్ద డ్రోన్ కెమెరాలు ఉపయోగించినందుకు ఎంపీ రేవంత్‌రెడ్డిపై రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించి జిల్లాలోని మియాఖాన్‌గూడ వద్ద డ్రోన్ కెమెరాలను వియోగించిన కేసులో రేవంత్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు.
ఈ కేసులో పోలీసులు బుధవారం ఐదుగురిని అరెస్టుచేయగా, విచారణ అనంతరం నిందితులుగా తేలితే రేవంత్‌రెడ్డి, అతని సోదరుడితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్న విషయం విదితమే.