చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన సన్నిహితుడు, ప్రముఖ వ్యాపార సంస్థ లింగమనేని వెంచర్స్ కార్యాలయాలపై తాజాగా ఐటీదాడులు జరిగాయి. విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని ఎల్‌వీపీఎల్ సంస్థ కార్యాలయానికి వెళ్లిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కలకలం రేపిన అమరావతి భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో లింగమనేని వెంచర్స్ అధినేత లింగమనేని రమేష్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కృష్ణానది కరకట్టపై లింగమనేని ఎస్టేట్స్ సంస్థ అక్రమంగా కట్టడాలు చేపట్టారని ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై సీఐడీ రంగంలోకి దిగింది. అమరావతిలో వైట్ రేషన్ కార్డుతో భూములు కొనుగోలు చేసిన పలువురిపై ఇప్పటికే కేసులు నమోదుచేసి పలువురి ఇళ్లలో సోదాలు చేశారు.
