ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 9 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకేతాలిచ్చారు. రెండు రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్కు మూడు తేదీలను ప్రభుత్వం సూచించినట్లు తెలియవచ్చింది. ఎన్నికలు ఒకే విడత నిర్వహించాలా.. దశల వారీనా అనే విషయాలపై సీఎం జగన్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. ముందు స్థానిక ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించి పూర్తి స్థాయి మెజారిటీ సాధించిన తరువాత బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు.
