మహిళల టి20 ప్రపంచ కప్లో భాగంగా నేడు జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. సిడ్నీలో భారీ వర్షం కురుస్తుండటంతో టాస్ ఇంకా వేయలేదు. వర్షం తగ్గే సూచనలు కన్పించడం లేదని స్థానిక సమాచారం. కనీసం 10 ఓవర్లు మ్యాచ్ జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ వర్షం తగ్గితే వెంటనే మ్యాచ్ జరిపేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. తొలి సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్, భారత జట్లు తలపడనున్నాయి. రిజర్వ్ డే లేకపోవడంతో మ్యాచ్ను ఎట్టిపరిస్థితుల్లోనే ఈరోజే నిర్వహించాలి. ఒకవేళ మ్యాచ్ రద్దయితే భారత్ నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో భారత్కు ఫైనల్ చాన్స్ దక్కుతుంది. మొదటి మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన రెండో సెమీస్ రద్దయితే సఫారి టీమ్ ఫైనల్కు వెళుతుంది. గ్రూప్ ‘బి’లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది.