శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మహానుభావుడు. ఈ చిత్రం మూడు సంవత్సరాల క్రితమే వచ్చింది. తన కెరీర్ లో ఇదొక మంచి ఇచ్చిన చిత్రం అని చెప్పాలి. అప్పుడెప్పుడో అయిపోయిన సినిమా కోసం ఇప్పుడెందుకు చెప్పుకోవడం అనుకుంటున్నారా ? తాజాగా జాను సినిమా హిట్ అయ్యింది కాబట్టి ఆ సినిమా కోసం అంతగా ఎవరూ మాట్లాడారు. కాని గత మూడురోజులుగా ఆ సినిమాకు సంబంధించి కొన్ని వీడియోస్, క్లిప్పింగ్ లు ఫుల్ వైరల్ అవుతున్నాయి దీనికి కారణం కరోనా వైరస్. ప్రస్తుతం తెలంగాణలో కరోనా భయం ఎక్కువగా ఉంది. దీనికి ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని కొన్ని వీడియోలు కూడా చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. ఈ వీడియోస్ చూస్తుంటే అందరికి మహానుభావుడు సినిమానే గుర్తొస్తుంది. ఆ వీడియోలో అప్పుడు హీరో చేసిన పనులు చూసి నవ్వుకున్నారు. కాని ఇప్పుడు అందరికి కావాల్సిన జాగ్రత్తలు అవే.
