ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా.. కరోనా.. వైరస్. దీని వలన చాలా మంది మృత్యు వాత పడుతున్నారు అని వార్తలు పుఖార్లై వైరలవుతుంది. అయితే ఇలాంటి వార్తల్లో ఎలాంటి వాస్తవము లేదు. ఇప్పటి వరకు ఈ వ్యాధి భారీన పడిన కేవలం మూడు వేల మంది మాత్రమే మరణించారు. చాలా మంది దీని నుండి చికిత్సతో బయటపడుతున్నారు.
ఇండియాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కరోనా ప్రభావంతో మాస్క్ లకు ఫుల్ డిమాండ్ ఏర్పడటంపై వైద్యాధికారులు స్పందించారు. N95 మాస్క్ అనేది కరోనా రోగులకు చికిత్స చేసే వైద్యులు ,సిబ్బంది,ఆ బాధితుల పక్కన ఉండే సహాయకులు మాత్రమే మాస్క్ లు ధరించాలి.
సాధారణ ప్రజలకు దీని అవసరం లేదు. కేవలం జలుబు,దగ్గు,ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా మాస్క్ లు లేదా చేతి రుమాలు ,టిష్యూ పేపర్లు వాడాలి. ఆరోగ్యవంతులకు మాస్క్ లు అవసరం లేదు వారు చెబుతున్నారు.