మార్చి 2న తెలంగాణలో కరోనా కేసు నమోదైన విషయం అందరికి తెలిసిందే. దాంతో అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అయితే దీనిపై తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చింది. ఈ వైరస్ కు సంబంధించి మొత్తం 47 శాంపిల్స్ టెస్ట్ మంగళవారం టెస్ట్ చేసారు. ఇందులో 45 మందికి నెగటివ్ వచ్చింది. మిగతా రెండు తదుపరి టెస్ట్ కొరకు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీకి పంపించారు. ఈ పాజిటివ్ వచ్చిన 45మందిని డిశ్చార్జ్ చేయడమే కాకుండా 14రోజులు జాగ్రత్తగా ఉండాలని సూసించారు. ఇక మరొక వ్యక్తిని గాంధీ హాస్పిటల్ లోనే ఉంచారు.
