Home / SLIDER / మార్చి 6 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

మార్చి 6 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

మార్చి 6, 2020 నుండి జరగనున్న శాసనసభ, శాసనమండలి 5వ విడత సమావేశాల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అధికారులు మరియు పోలీసు శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించిన శాసనసభ సభాపతి  పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్   గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి.

ఈసందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర శాసనసభ జరిగే తీరు దేశంలోనే ఆదర్శంగా ఉండాలి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే విధంగా జరుగుతున్న శాసనసభ సమావేశాలను ప్రజలు గమనిస్తుంటారు. సభ సజావుగా జరగడానికి సభ్యులు, అధికారుల మధ్య ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి.

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్  నేతి విద్యాసాగర్, అసెంబ్లీ చీఫ్ విప్  వినయ్ భాస్కర్, శాసనమండలి చీఫ్ విప్ బోడేకంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి   సోమేష్ కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు మరియు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తదుపరి పోలీస్ అధికారుల సమావేశంలో సభాపతి   మాట్లాడుతూ….తెలంగాణ పోలీసు శాఖ సమర్ధవంతమైన పనితీరుతో గత సమావేశాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా జరిగాయన్నారు. ఈ సమావేశాలు కూడా సజావుగా జరగడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రాలలో చట్టసభలు జరుగుతున్న సమయంలో చోటుచేసుకుంటున్న అవాంచనీయ సంఘటనలు ఇక్కడ జరగడం లేదు. రాష్ట్ర స్థాయిలో సమర్ధవంతమైన నాయకత్వం ఉంటే ఫలితాలు ఎంత బాగుంటాయో తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నామని అన్నారు.ఈ సమావేశంలో డిజీపి మహేందర్ రెడ్డి, డీజీ (SPF) తేజ్ దీప్ కౌర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ ఇతర అధికారులు, అసెంబ్లీ చీఫ్ మార్షల్ టి. కరుణాకర్ పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat