స్థానిక సంస్థల రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ నేత బిర్రు ప్రతాపరెడ్డి వేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, అలాగే నెలరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తీర్పు చెప్పంది. ఈ తీర్పు మేరకు ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. అయితే బీసీ రిజర్వేషన్లపై టీడీపీ రాజకీయం చేస్తోంది. బీసీలకు ద్రోహం చేసే విధంగా బిర్రు ప్రతాపరెడ్డితో కేసులు వేయించిన చంద్రబాబు..బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని, సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చుగా అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. అంతే కాదు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో తిరిగే బిర్రుపత్రాపరెడ్డి మా టీడీపీ నేత కాదు…వైసీపీ నేత అంటూ బుకాయిస్తున్నాడు.
అయితే తాజాగా చంద్రబాబు విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. వెనుకబడిన వర్గాలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా అడ్డుకున్నారని జోగి రమేష్ విమర్శించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా టీడీపీ నేత ప్రతాప్ రెడ్డి చేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని మండిపడ్డారు. ప్రతాప్ రెడ్డి వైస్సార్‌సీపీ నేత అంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి అనే పేరున్న వారంతా వైఎస్సార్‌సీపీకి చెందిన వారిలా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు టీడీపీ నేత సోమిరెడ్డి పేరులో కూడా రెడ్డి ఉందని, ఆయన కూడా వైఎస్సార్‌సీపీకి చెందిన వారేనా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు హయాంలోనే ప్రతాప్ రెడ్డికి ఉపాధి హామీ పథకంలో నామినేటెడ్ పదవి కట్టబెట్టారని ఆయన గుర్తుచేశారు. ‘టీడీపీలో ఉన్న బీసీ నేతలు చంద్రబాబు తొత్తులుగా మారారని ఫైర్ అయ్యారు. . బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకుని మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళమని సలహా ఇస్తున్నారని జోగి రమేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు బీసీలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.