కర్నూలు మాజీ మేయర్ , టీడీపీ నేత బంగి అనంతయ్య ఆత్మహత్య యత్నం చేశారు. ఆయన తన ఇంటిలో ఉరి వేసుకునే యత్నం చేయగా, కుటుంబ సబ్యులు, స్థానికులు అడ్డుకుని ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. తాను పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశానని, అయినా పార్టీ పరంగా గుర్తింపు లేదని ఆయన వాపోతున్నారు. పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆయన బాదపడుతున్నారు. కాగా తాను పార్టీ కోసం ఖర్చు పెట్టినందున ,కొంత ఆర్దిక సమస్యను తీర్చాలని అనంతయ్య టీడీపీ అదినేత చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారట. కాని చంద్రబాబు నుంచి స్పందన లేకపోవడంతో ఆయన ఆత్మహత్య యత్నం చేశారని వార్తలు సూచిస్తున్నాయి.
