మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోల్పోయాక ఆయన మతి కొద్దికొద్దిగా పోతుందని చెప్పాలి. ఆయన చేసిన పనులు చూస్తుంటే అధికారం లేకపోతే బ్రతకలేరేమో అనిపిస్తుంది. మరోపక్క ఎంతమందిని భరిలోకి దింపిన పని అవ్వకపోవడంతో ఇక చంద్రబాబే దగ్గరుండి జగన్ పై నిందలు మోపాలని చూస్తున్నారు. అవి కూడా బెడిసికొడుతున్నాయి. ఇక అసలు విషయానికి బాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీల విషయంలో చేసిన అరాచకాలను ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి బయటపెట్టారు. ‘అంగిట బెల్లం ఆత్మలో విషం’ అనేది చంద్రబాబు నైజాన్నివర్ణించడానికే పుట్టింది. పైకి ఎక్కడలేని ప్రేమ నటిస్తాడు.చేసేవి మాత్రం బీసీలను అణగదొక్కే పనులు. బీసీలు హైకోర్టు జడ్జిలుగా, ఉన్నత స్థాయి పదవుల్లో పనికి రారంటాడు. తన వర్గం తప్ప బీసీలు ఎప్పటికీ అధికార పీఠం దరిదాపులకు రాకుండా చేశాడు.
