తెలంగాణలో సిద్దిపేట పట్టణంలోని సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ సివిల్ నిర్మాణ పనులన్నీ 15 రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.
సిద్ధిపేట మినీ ట్యాoకు బండ్-కోమటి చెరువు కట్టపై నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డుపై బుధవారం ఉదయం మంత్రి మార్నింగ్ వాక్ చేశారు. నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండాలని అధికారులకు ఆదేశించారు.
నిర్మాణ పనులను కూడా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు సైకిలింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ మొదటి విడత నిర్మాణ పనులు 465 మీటర్లు చేపట్టినట్లు అధికారులు మంత్రికి వివరించారు.