గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాలనలో నిరుద్యోగులు అందరూ ఆయనపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఏఒక్కరికి న్యాయం జరగలేదు. జాబు కావాలంటే బాబు రావాలి అని నమ్మించి చివరికి ఓట్లు వేసి గెలిచిన తరువాత ఎవరినీ పట్టించుకోలేదు. దాంతో నిరుద్యోగులు నిలువునా మునిగిపోయాం అని భాదపడ్డారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చినాక తానూ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే నిరుద్యోగులకు 4.5లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే లోకేష్ తాజాగా ట్విట్టర్ లో వీరి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. “90 శాతం వైకాపా కార్యకర్తలే వాలంటీర్లు. వారు రేపులు చేసినా, పాపాలు చేసినా వైకాపా ఆశీస్సులున్నాయని అర్థం అవుతోంది. జగన్ గారు అప్పగించిన బాధ్యతలను దండుపాళ్యం గ్యాంగుల్లా పూర్తిచేస్తున్న వాలంటీర్లకు వైకాపా హ్యాట్సాఫ్ చెప్పడంలో వింతేముంది?” అని అన్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.”మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి. వ్యాధి లక్షణాలేవీ బయటకు కనిపించకున్నా అతని నోటి దూల సమాజంలో అశాంతిని ప్రేరేపించేలా ఉంది. అత్యంత నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న 4.5 లక్షల మంది వలంటీర్లను రేపిస్టులు, దండుపాళ్యం క్రిమినల్స్ అని తిట్టి పోస్తున్నాడు” అని అన్నాడు.
