టీమిండియా న్యూజిలాండ్ టూర్ అనగానే అందరూ ఒకటే అనుకున్నారు. ఇప్పటివరకు టీ20లలో ఆ జట్టుపై అస్సల ఫామ్ లేని భారత్ ఈసారి గెలుస్తుందా లేదా అని కాని అనూహ్య రీతిలో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. దాంతో టీ20 గెలిచాక ఇక మిగతావి పెద్ద కష్టం కాదని అనుకొని సంబరాల్లో మునిగిపోయింది. కాని మిగతా వన్డే, టెస్టుల్లో భారత్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది కివీస్. రెండింటిలో కివీస్ భారత్ ను క్లీన్ స్వీప్ చేసింది. దాంతో మొదట్లో సంతోషించిన అభిమానులు ఇప్పుడు కోపంతో రగిలిపోతున్నారు. ఇక చివరిగా కోహ్లిపై తీవ్రంగా అసంతృప్తి చెందుతున్నారు.
