మార్చ్ 2..తెలంగాణలో మొదటి కరోనా వైరస్ కేసు బయటపడింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ హెల్త్ అధికారులు పూర్తి విశ్లేషణ చేసి వివరాలు తెలుసుకున్నారు. మనకి వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన ఒక సాఫ్ట్ వేర్ కుర్రాడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ఫిబ్రవరి 15న బెంగుళూరు నుండి దుబాయ్ వెళ్లి అక్కడ 19 తీదీ వరకు ఉన్నాడు. ఫిబ్రవరి 20న దుబాయ్ నుండి తిరిగి వచ్చేసాడు. అనంతరం ఎయిర్ పోర్ట్ నుండి తన నివాసానికి టాక్సీ లో వచ్చేసాడు. 21న అనగా శుక్రవారం ఎప్పటిలానే ఆఫీస్ కి వెళ్ళాడు. ఇంక అదేరోజున ఒక ప్రైవేటు బస్సులో హైదరాబాద్ చేరుకున్నాడు. శనివారం అనగా ఫిబ్రవరి 22న ఇంటికి వచ్చి కుటుంబీకులతో ఉన్నాడు. అదేరోజు సాయంత్రం అతడికి జ్వరం వచ్చింది. ఫిబ్రవరి 27న లక్షణాలు కనిపించడంతో ప్రైవేటు ఆశుపత్రిలో చూపించారు. ఇక మార్చి 1న గాంధీ ఆశుపత్రిలో అడ్మిట్ అవ్వగా మార్చి 2న టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. దాంతో హెల్త్ అధికారులు అతడు దుబాయ్ నుండి బయలుదేరినప్పటి నుండి అతడు ఎందులో ప్రయాణించాడో వారందరినీ పూర్తిగా అబ్జర్వేసన్ లో పెట్టడం జరిగింది.
