తెలంగాణలో కరోనా పాజిటివ్ వచి కొన్ని గంటలు కూడా కాలేదు..ఇప్పుడు తాజాగా కోనసీమలో ఈ వైరస్ కలకలం రేపుతుంది. దక్షిణ కొరియా నుండి వచ్చిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఈ వైరస్ వచ్చినట్లు అనుమానిస్తున్నారు. కొత్తపేటకు చెందిన ఈ వ్యక్తి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. కొన్నాళ్ళ తరువాత అతడు ఉద్యోగ నిమిత్తం దక్షణ కొరియా వెళ్లి హైదరాబాద్ తిరివచ్చి ఇప్పుడు ఇంటికి చేరుకున్నాడు. పూర్తి విషయం తెలుసుకున్న అధికారులు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు వివరాలు పంపించారు. దాంతో అప్రమత్తమయిన అధికారులు అతడి ఊరు వాడపాలెం చేరుకున్నారు.
