Home / ANDHRAPRADESH / స్థానిక సంస్థల రిజర్వేషన్లపై బయటపడిన చంద్రబాబు కుట్ర…ఇవిగో సాక్ష్యాలు..!

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై బయటపడిన చంద్రబాబు కుట్ర…ఇవిగో సాక్ష్యాలు..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు జగన్ సర్కార్ 59 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అనుచరుడైన బిర్రు ప్రతాపరెడ్డి వేసిన పిటీషన్‌పై హైకోర్ట్ తీర్పు ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతంకు మించకూడదని, నెల రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం హైకోర్ట్ తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సమాయాత్తం అవుతుంది. అయితే చంద్రబాబుకు మళ్లీ తన కుటిల రాజకీయం మొదలెట్టాడు. దొంగే దొంగా దొంగా అరిచినట్లుగా…చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు.. ఈ సందర్భంగా హైకోర్టులో కేసు వేసిన ప్రతాపరెడ్డి వైసీపీ నాయకుడే అంటూ ఎదురుదాడి చేశాడు. తమ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి పనిచేసే వారంతా టీడీపీ వాళ్లు కాదని.. బిర్రు ప్రతాప్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకుడేనని చంద్రబాబు నాయకుడు బుకాయించాడు. ప్రతాప్‌రెడ్డితో కేసు వేయించి కావాలనే ఎన్నికలు ఆలస్యం చేయించిన చంద్రబాబు ఆ నింద వైసీపీ ప్రభుత్వంపై వేశాడు.

 

స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం చేయాలనే ప్రతాపరెడ్డితో సుప్రీంకోర్ట్‌లో కేసులు వేయించిన చంద్రబాబు…ఇప్పుడు హైకోర్టు ఒక నెల సమయమిచ్చినా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడంలేదని రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు. 59 శాతం రిజర్వేషన్లపై ప్రతాపరెడ్డిని కోర్టుల చుట్టూ తిప్పిన చంద్రబాబు ఇప్పుడు 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదంటూ నాలిక మడతేస్తున్నాడు. అయితే చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ అనుచరుడైన బిర్రు ప్రతాపరెడ్డి టీడీపీ నేత కాదని, వైసీపీ నేత అని చంద్రబాబు ఆరోపించడం హాస్యాస్పదంగా మారింది. సదరు ప్రతాపరెడ్డి టీడీపీ నేత అంటూ చంద్రబాబు, లోకేష్‌లతో అతను దిగిన ఫోటోలు మీడియాలో హచ్‌చల్ చేయడంతో  తండ్రి కొడుకులు తేలుకుట్టిన దొంగల్లా కామ్ అయిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏదో ప్రభుత్వంపై బురద జల్లుదామనే ఉత్సాహంతో చంద్రబాబు, లోకేష్‌లు చేయించిన పని తిరిగి వారికే రివర్స్ కొట్టింది.  స్థానిక సంస్థల రిజర్వేషన్లపై కేసులు వేసిన బిర్రు పతాపరెడ్డి చంద్రబాబు, లోకేష్‌లకు ఎంత సన్నిహితుడో ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.  మొత్తంగా బీసీ రిజర్వేషన్లతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, తమ స్థానిక టీడీపీ నేతతో కేసులు వేయించిన చంద్రబాబు బండారం బట్టబయలై పోయింది. కాగా ఎంత చీత్కరించుకున్నా తల్లికొడుకులకు ఏ మాత్రం సిగ్గులేకుండా కుట్రలు చేస్తున్నారంటూ బీసీలు మండిపడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat