తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూము లు కబ్జాచేసిన కాం గ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఇంచార్జి మేడి పాపయ్య మాది గ ధ్వజమెత్తారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించిన రేవంత్‌రెడ్డిని వెంటనే అరెస్టుచేసి, భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
మంగళవారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోడ్లను ఆక్రమించి గేట్లు పెట్టుకోవడమే కాకుండా ప్రభుత్వ భూములను ప్రైవే ట్ భూములుగా చిత్రీకరించి రియల్ దందా నడిపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
రేవంత్ తన భూబాగోతాన్ని కప్పిపుచ్చుకొనేందుకు మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవితపై ఆరోపణలుచేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఆక్రమించుకున్న భూములను ఆధికారులు స్వాధీనం చేసుకోని పక్షంలో వాటిని కాపాడుకొనేందుకు ఎమ్మార్పీఎస్ ముందుకు వస్తుందని ఆయన స్పష్టం చేశారు.