ఏపీలో ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ నేతల రౌడీయిజం ఏ మాత్రం తగ్గడం లేదు..ఇక బూతుపురాణం విప్పడంలో టీడీపీ నేతల తర్వాతే ఎవరైనా..ఇప్పటికీ అదే అహంకారం..అదే పొగరుబోతుతనం..అధికారులపై బూతులతో విరుచుకుపడడం కామనై పోయింది. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు అధికారులను రాస్కెల్స్, ఇడియట్స్, మీ అంతు చూస్తా అంటూ బెదిరిస్తుంటే..తెలుగు తమ్ముళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు. తాజాగా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ తన నైజాన్ని మరోసారి బయటపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూసి బూతులు తిట్టే ఈ నాయకుడి వైఖరి మరోసారి బట్టబయలైంది. ఓడిపోయానన్న బాధ ఇంకా పోలేదో.. అధికారంలో లేనన్న సంగతి గుర్తు లేదో గానీ సరుబుజ్జిలి ఇన్ చార్జి ఈఓపీఆర్‌డీ గూనపు వెంకట అప్పలనాయుడుపై రాయ లేని భాషలో బెదిరింపులకు దిగారు.
ఏమయ్యా నీవు బాగా పెద్దోడివయినట్లు ఉన్నావ్…నా నెంబర్‌తో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా అంటూ ఎమ్మెల్యేపై బూతులతో విరుచుకుపడ్డారు. రావివలస గ్రామపంచాయితీకి నిధులు ఎందుకు ఆ రాయుడుకు ఎందుకు ఇవ్వలేదురా..నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు నా …అంటూ అంటూ రాయలేని పదజాలంతో అధికారిపై బండ బూతులతో విరుచుకుపడ్డారు. కూన రవికుమార్‌కు ఇలా అధికారులను దూషించడం కొత్తేమీ కాదు. గతంలో సరుబుజ్జిలి ఎంపీడీఓ ఎ.దామోదరరావు, అప్పటి ఈఓపీఆర్‌డీ పీవీ మురళిమోహన్‌పై దూషణలకు దిగారు. ‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. నన్వు ఎవరూ ఆపలేరు. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా’ అంటూ సరుబుజ్జిలి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని మాజీ విప్ కూన రవికుమార్ బెదిరించారు. అలాగే, బూర్జలో ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ ని కూడా నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. ఇప్పటికే సరుబుజ్జిలి ఎంపీడీఓ, గత ఈఓపీఆర్‌డీని బెదిరించిన కేసులో కూన అరెస్ట్ అయి…జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చారు. అయినా…కూన తీరు తన తీర్చు మార్చుకోవడం లేదు..ఇప్పుడు సరుబుజ్జిలి ఈఓపీఆరీ అధికారిపై కూన రవికుమార్ బూతులతో విరుచుకుపడడం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. కాగా ప్రభుత్వ అధికారిని దూషించిన కూన రవికుమార్‌పై ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ న”బూతే” నభవిష్యత్తుగా రెచ్చిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.