నారావారి పుత్రరత్నం, ట్విట్టర్ పిట్ట నారా లోకేషం సారు ట్విట్టర్‌లో మహా యాక్టివ్…పొద్దున్నే లేవగానే రోజూ ట్విట్టర్‌లో జగన్‌పై ఏదో ఒక కూతెట్టడం..అదిగో మా చినబాబు చించేశారు..జగన్‌ను చెడుగుడు ఆడేసాడు..అని తెలుగు తమ్ముళ్లు, ఎల్లో మీడియా ఛానళ్లు బట్టలు చించుకోవడం కామన్ అయిపోయింది..అయితే ట్విట్టర్‌లో జగన్‌ను తిట్టబోయే తొందరలో ఏదో ఒకటి గబుక్కున ట్వీటడం నెట్‌జన్లకు అడ్డంగా దొరికిపోవడం కూడా చినబాబుకు అలవాటుగా మారిపోయింది. తాజాగా జగన్‌పై ఓ సిగ్గుమాలిన ట్వీట్ వేసి చినబాబు మళ్లీ నెట్‌జన్లకు బుక్కయ్యాడు..మార్చి 1 ఆదివారం నాడు పొద్దున్నే యువరాజా వారు ట్వీట్ వేశారు. జగన్ సర్కార్ ఆదివారం నాడు ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది…దానికి సంబంధించిన ప్రకటన అన్ని పేపర్లలో వచ్చింది. ఇంకేముంది చినబాబు గారు ఆ పేపర్ యాడ్ క్లిప్పింగ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి…జగన్‌ను ఓ రేంజ‌్‌లో తిడుతున్నానని ఫీల్ అయిపోయి..ఇలా ట్వీట్ చేశారు.
సిగ్గు అనేది పూర్తిగా వదిలేశారా వైయస్ జగన్ ? ప్రభుత్వ ప్రకటనల్లో, ఇలా తప్పుడు సమాచారం ప్రచారం చెయ్యటానికి, ఇదేమన్నా మీ దొంగ సాక్షి అనుకున్నారా ? జనవరి 2019 నుంచి మీరు ప్రజల నెత్తిన పడిన జూన్ 2019 దాకా, 54.47 లక్షల మందికి పెన్షన్ ఇచ్చింది మర్చిపోయారా ? మీ నాయన కేవలం రూ.200 ఇస్తే, మా నాయన 2014లో వెయ్యి రూపాయలు, 2019లో రెండు వేలు చేశారు. అంటే, పది రెట్లు ఎక్కువ. ఇప్పుడు తమరు వచ్చి, 3 వేలు అని మోసం చేసి, లింగులిటుకుమంటూ, రూ.250 పెంచి, మోసం చేసింది కాక, ప్రభుత్వ సొమ్ముతో, ఇలా అబద్దపు డబ్బాలు కొట్టుకుంటారా అంటూ ట్వీటేసి జగన్‌ను తిట్టాననుకుని మురిసిపోయాడు.
ఇక మా చినబాబు ట్వీటేశాడహో..పింఛన్లపై జగన్‌ను నిలదీశారహో అంటూ ఎల్లోమీడియా ఓ రేంజ్‌లో భజన చేసింది. అయితే ఇంతకంటే సిగ్గుమాలిన ట్వీట్ ఉండదంటూ…నెట్‌జన్లు చినబాబును చెడుగుడు ఆడుకోవడం మొదలెట్టారు…నాయనా లోకేషా…జగన్ పింఛన్ రూ. 3 వేలకు ఒకేసారి పెంచుతా అని ఎన్నికల ముందు చెప్పలేదు..3 వేలకు పెంచుకుంటూ పోతా అని చెప్పాడు…ఆ మేరకు రూ. 250 చొప్పున పెంచుకుంటూ పోతున్నాడు..మీకు లాగా ఎన్నికలకు ఆరేడు నెలలకు ముందు ముందు పసుపుకుంకుమ, నిరుద్యోగ భృతి అంటూ ప్రజలను మోసం చేయడం లేదు…పింఛన్లు కూడా ఎన్నికల ముందు ఓట్ల కోసం పెంచారు..అదీ జగన్ పింఛన్లను పెంచుతాడనే భయంతోనే పెంచారు…అందుకే కదా ప్రజలు మీకు 23 సీట్లే ఇచ్చి మీ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు..స్వయంగా నిన్ను మంగళగిరిలో ఓడించారు అయినా సిగ్గు లేకుండా…ఇలాంటి సిగ్గుమాలిన ట్వీట్లు చేయడం ఏంటీ..జనం నవ్వుకుంటారనే కనీసం ఇంగిత జ్ఞానం లేదా అంటూ నెట్‌జన్లు లోకేష్‌ను చెడుగుడు ఆడుకున్నారు. మొత్తంగా పింఛన్ల విషయంలో లోకేష్ అత్యుత్సాహాంతో ట్వీట్ చేసి మరోసారి నెట్‌జన్లకు అడ్డంగా దొరికిపోయాడు..కాస్త బుర్ర పెంచు చినబాబు.